వైఎస్సార్సీపీ సేవలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు- చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్ - Government Employees Campaign - GOVERNMENT EMPLOYEES CAMPAIGN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-05-2024/640-480-21382469-thumbnail-16x9-ysrcp-campaign.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 4, 2024, 12:17 PM IST
Government Employees and Volunteers in YSRCP Election Campaign in Nellore District : ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన వద్దని ఎన్నికల సంఘం (ఈసీ) ఎన్ని సార్లు హెచ్చరించినా కొందరు వారి ధోరణి మార్చుకోవడం లేదు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, మర్రిపాడు మండలంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రం రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ప్రచారంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెమ్మసాని శ్రీనివాసుల నాయుడు, వాలంటీర్ జనార్దన్ పాల్గొన్నారు.
ఉద్యోగులు, వాలంటీర్లు వైఎస్సార్సీపీ నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్న అధికారులు పట్టించుకోవడం లేదని విపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి వైఎస్సార్సీపీ ప్రచారంలో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పెమ్మసాని శ్రీనివాసులునాయుడు దేవూరు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధాయుడుగా పనిచేస్తున్నారు. సెలవుల కాలంలో టెర్మినేట్ చేశామని, వేసవి సెలవుల అనంతరం విధుల్లోకి తీసుకుంటారని ఎంఈవో పేర్కొన్నారు.