6 జిల్లాల్లో 87 కరవు మండలాలు - ప్రకటించిన ప్రభుత్వం - Drought Mandals in AP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 17, 2024, 11:42 AM IST
Government Announced Drought Mandals in AP: రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాల్లో 87 మండలాలను కరవు మండలాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈశాన్య రుతుపవనాలు సీజన్లో సరైన వర్షాలు లేకపోవడంతో 6 జిల్లాల్లోనీ 87 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం పేర్కొంది. 63 మండలాల్లో తీవ్ర స్థాయిలో, 24 మండలాల్లో తక్కువ స్థాయిలో కరవు ఉన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
నెల్లూరు జిల్లాలో 10, కర్నూలు జిల్లాలో 18, నంద్యాల జిల్లాలో 13, అనంతపురంలో 14, సత్యసాయి జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 31 మండలాలు కరవు బారిన పడినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ మండలాల్లోని రైతులకు పంటనష్టం పరిహారం దక్కేలా చర్యలు చేపడుతున్నట్టు నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే కరవు మండలాలను ప్రకటించడంలోనూ రైతులను మోసం చేసిందని ప్రతిపక్షనేతలు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 661 మండలాల్లో పొడి వాతావరణం, 16.75 లక్షల ఎకరాల్లో పంటలు వేయని పరిస్థితి ఉంటే కేవలం 87 కరవు మండలాలనే ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.