గూడూరులో పట్టపగలే బంగారం వ్యాపారి కిడ్నాప్ - కారణం అదేనా? - Gold Business Man Kidnap - GOLD BUSINESS MAN KIDNAP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 30, 2024, 7:16 AM IST
Gold Business Man Kidnap in Kurnool District : కర్నూలు జిల్లా గూడూరులో పట్టపగలే బంగారం వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. పట్టణానికి చెందిన బంగారం వ్యాపారి డమాం వెంకటేష్‌కు బెళగల్ మార్గంలో దుకాణాలు ఉన్నాయి. వాటిని అద్దెకు తీసుకుంటామని ఓ వ్యక్తి ఫోన్‌లో తెలిపి వాటిని చూపించాలని కోరారు. సోమవారం దుకాణాల వద్దకు వచ్చిన వెంకటేష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు స్కార్పియో వాహనంలో బలవంతంగా ఎత్తుకెళ్లారు. వెంకటేష్‌ను పులకుర్తి రహదారి వైపు తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.
తన సోదరుడు కిడ్నాప్‌నకు గురయ్యాడని వెంకటేష్ తమ్ముడు కాశీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. వెంకటేశ్వర్లు కుటుంబం ఆర్థికంగా స్థితిమంతులు. వీరికి పట్టణంలో పలుచోట్ల ఖరీదు చేసే స్థలాలు, బంగారం వ్యాపారం, భవంతులు ఉన్నాయి. దీంతో ఎవరైనా డబ్బు కోసం ఇలా చేసి ఉండవచ్చునని పోలీస్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.