బీజేపీలో చేరిన ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ- ఆహ్వానించిన పురందేశ్వరి - Joins BJP in Vijayawada

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 4:59 PM IST

Golagani Charitable Trust Chairman Golagani Ravi Krishna joins BJP : సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కార్యకర్తలు ప్రతిపక్షంలోకి, ప్రతిపక్ష కార్యకర్తలు అధికార పక్షానికి వలసల పరంపర కొనసాగుతోంది.

బీజేపీలోకి గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari)ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుడు, గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ గొలగాని రవికృష్ణ, ఆయన అనుచరులు ఆ పార్టీలో చేరారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కాషాయం కండువా కప్పి పురందేశ్వరి వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గొలగాని రవికృష్ణ విజయవాడ నగరంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారని పురందేశ్వరి తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలకు అండగా నిలిచారని అన్నారు.

ఎన్నికల పొత్తులపై త్వరలో తెలుస్తోంది : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రవికృష్ణ చేరికతో బీజేపీ మరింత బలపడుతుందని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. బీజేపీలో చేరే వారందరూ పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆమె కోరారు. ఎన్నికల పొత్తులపై తమ అధినాయకత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.