LIVE: వేమూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - chandrababu naidu live - CHANDRABABU NAIDU LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 12, 2024, 6:03 PM IST
|Updated : Apr 12, 2024, 7:23 PM IST
TDP Leader Nara Chandrababu Naidu Election Campaign in Vemuru Live : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రచార జోరును పెంచారు. రాష్ట్రంలో ప్రజాగళం పేరుతో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు ఇవాళ వేమూరులో సభ కార్యక్రమంలో పాల్గొనున్నారు. కొద్దిసేపు క్రితమే అమలాపురం నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకొని అక్కడ కూటమి అభ్యర్థులతో చర్చించారు. ఎన్నికల ప్రచార శైలి, భవిష్యత్తు కార్యచారణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారు. అనంతరం వేమూరులో జరిగే ప్రజాగళం సమావేశానికి బయలుదేరారు.Vemuru Constituency : ఇవాళ సాయంత్రం వేమూరు, రేపల్లే నియోజకవర్గాల్లో నారా చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు పర్యటన దృష్టిలో పెట్టికొని పార్టీ కార్యకర్తలు అన్ని రకాల ఏర్పాటు చేశారు. వేమూరులో ప్రజాగళం సభకు పార్టీ అభిమానులు, మహిళలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.
Last Updated : Apr 12, 2024, 7:23 PM IST