వార్షిక ఆదాయంపై జెన్కో, ట్రాన్స్కో నివేదిక - విద్యుత్ కోతలు, సరఫరాపై ఈఆర్సీ సమీక్ష - Power Bills
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 13, 2024, 4:39 PM IST
Genco and Transco Report on Annual Income: 2023-24 వార్షిక ఆదాయలపై జెన్ కో, ట్రాన్స్ కో నివేదికలు సమర్పించాయని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి తెలిపారు. తిరుపతి ఏపీ ఎస్పీడీసీఎల్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్ధాయి సలహా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏ వర్గంపై విద్యుత్ భారం మోపే ప్రతిపాదన లేదన్నారు. విద్యుత్ వాడకాన్ని బట్టి రైల్వే శాఖ నుంచి 100 కోట్ల రూపాయల అదనపు ఆదాయం చేకూరేలా ధరలు పెంచడానికి ప్రతిపాదించామన్నారు. విద్యుత్తు సరఫరా, అంతరాయాలపై సబ్ స్టేషన్ల వారీగా సమస్యలు పరిష్కరించేందుకు ఉన్నతాధికారులను నియమించడం ద్వారా మెరుగెన ఫలితాలు వస్తున్నాయన్నారు.
డిస్కంలకు దాదాపు రూ.13 వేల కోట్లు లోటు భరించనున్నట్లు జెన్కో సీఎండీ ద్వారా ప్రభుత్వం చెప్పిందని విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి ఇటీవల వెల్లడించారు. విద్యుత్ నియంత్రణ మండలి చేపట్టిన 2024-25 టారిఫ్ ప్రతిపాదనలపై విశాఖ కేంద్రంగా వర్చువల్ విధానంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం విదితమే. డిస్కంలు ఛార్జీల పెంపుదల ప్రతిపాదించలేదని చెప్తూ రైల్వేకి మాత్రమే వంద కోట్ల ఛార్జీలు పెంపుదల ప్రతిపాదన ఉందన్నారు.