పరిశ్రమలో గ్యాస్ లీక్ - 50 మందికి తీవ్ర అస్వస్థత! - GAS LEAK in AP - GAS LEAK IN AP
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-06-2024/640-480-21611374-thumbnail-16x9-gas-leak-in-cmr-aluminium-factory.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 1, 2024, 9:19 PM IST
Gas Leak in CMR Aluminium Factory of Tirupati District : తిరుపతి జిల్లాలో విషవాయువు లీక్ కారణంగా పదుల సంఖ్యలో కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని రాజులపాలెం మండలం ఏర్పేడు సీఎంఆర్ అల్యూమినియం కర్మాగారంలో ఈ భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అల్యూమినియం తుక్కు కరిగించే క్రమంలో ఓ చిన్నపాటి సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయ్యింది. దీనిని పీల్చిన కార్మికులు సుమారు 50 మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో 20 మంది మహిళలు సహా మరో 30 మంది అస్వస్థతకు గురయ్యారు.
Gas Leak in AP : అస్వస్థకు గురైన కార్మికులను పరిశ్రమ యాజమాన్యం హుటాహుటిన రేణిగుంట బాలాజీ హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆరోగ్యం మెరుగుపడిన కార్మికులను తిరిగి పరిశ్రమకు తీసుకువచ్చారు. కొందరు కర్మికుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారు. విష వాయువు లీక్ అయ్యిందన్న సమాచారంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.