"ఫ్రీ గ్యాస్ సిలిండర్" - అర్హులకు నేరుగా బ్యాంకు ఖాతాకే డబ్బులు - FREE GAS CYLINDER SCHEME
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 29, 2024, 3:53 PM IST
Free Gas Cylinder Scheme: ఉచిత గ్యాస్ పథకం ప్రారంభం కావడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు క్యూకట్టారు. దీంతో గ్యాస్ బుకింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, వినియోగదారులకు వస్తున్న సమస్యలపై సివిల్ సప్లైస్ కమిషనర్ వీరపాండ్యన్ ఆరా తీశారు. గ్యాస్ కంపెనీ ఏజెన్సీల సిబ్బందికి ఉచిత గ్యాస్ పంపిణీ ప్రక్రియపై పలు సూచనలు చేశారు. వినియోగదారులకు సమస్యలు రాకుండా అర్హులైన వారందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని తెలిపారు.
దీనికోసం ప్రస్తుతం ప్రత్యేకంగా ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇప్పటికే అర్హులందరికీ బ్యాంక్ అకౌంట్లతో లింక్ అయి ఉన్నాయని హెచ్పీసీఎల్ డీజీఎం శ్రీనివాస్ తెలిపారు. ఏదైనా సమస్య వస్తే సచివాలయంలో కానీ, హెల్ప్ లైన్ నెంబర్ 1967కి కాల్ చేసి అడగొచ్చని అన్నారు. లేదా సంబంధిత డిస్ట్రిబ్యూటర్ దగ్గరకి వెళ్లినా వివరాలు అందిస్తారని పేర్కొన్నారు. అర్హులైన వారికి ఒక ఎస్ఎంఎస్ వస్తుందని తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.