ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం - రూ.12 లక్షలు టోకరా - Fraud in the Name of Jobs
🎬 Watch Now: Feature Video
Fraud in the Name of VRO Jobs in Penamalur: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు మోసం చేసి 12 లక్షలు కాజేసిన ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో జరిగింది. తాడిగడపకు చెందిన శ్రీకాంత్ ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వీఆర్వో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరుకి చెందిన శ్యాంబాబు నమ్మబలికాడు. ఆ మాయ మాటలు నమ్మిన శ్రీకాంత్ సుమారు 7 లక్షల రూపాయలు శ్యాంబాబుకు ముట్ట చెప్పాడు. శ్రీకాంత్తో పాటు అతని స్నేహితుడికి ఉద్యోగం ఇప్పిస్తామంటూ అతని నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అనంతరం బాధితులకు ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. ట్రైనింగ్ పేరుతో ప్రస్తుతం ప్రభుత్వ వీఆర్వోలుగా ఉన్న ముగ్గురి దగ్గరకు పంపించారు. ట్రైనింగ్ సమయంలో నెలకు 15 వేల రూపాయలు జీతం ఇచ్చారని బాధితులు వెల్లడించారు. ఎంతకాలమైనా ఉద్యోగం రాకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.