విజయవాడ బాధితులకు అండగా ప్రభుత్వం - డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ ముమ్మరం - FOOD DELIVERY WITH DRONES

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 2:51 PM IST

thumbnail
విజయవాడలో డ్రోన్ల ద్వారా వరద ప్రాంతాల్లో ఆహారం పంపిణీ (ETV Bharat)

Food Delivery with Drones in Vijayawada : విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం వేగవంతవంతం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరుండి వాటిని పర్యవేక్షిస్తున్నారు. సీఎం ఆదేశాలతో మరో 200ల మంది ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యల కోసం బయట నుంచి కూలీలను కూడా తరలిస్తున్నారు. బోట్లు, హెలికాప్టర్ల సాయంతో తాగునీరు, శక్తినిచ్చే పానీయాలు, బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలను బాధితులకు చేరవేస్తున్నారు. 

Vijayawada Floods Updates : అవి వెళ్లలేని ఇరుకు ప్రాంతాల్లోకి డ్రోన్లను వినియోగిస్తున్నారు. వాటి ద్వారా ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారు. మరోవైపు విజయవాడలో వరద క్రమంగా తగ్గుతోంది. అనేక ప్రాంతాల్లో కరెంట్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ పునరుద్ధరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. యనమలకుదురులోని పలు కాలనీల్లో ఇళ్లలో నీరు తగ్గింది. దీంతో స్థానికులు తిరిగి ఇళ్లలోకి చేరుకుంటున్నారు. సింగ్‌నగర్‌లో వరద ప్రభావం తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీకి కొంతమేర వరద తగ్గడంతో లంక గ్రామాలు ఊపరి పీల్చుకున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.