రాజమండ్రి కేంద్ర కారాగారం వద్ద చేపల వ్యాపారి కిడ్నాప్- కోట్ల బకాయిలే కారణం - Fishmonger Kidnap at Rajahmundry - FISHMONGER KIDNAP AT RAJAHMUNDRY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2024, 12:17 PM IST
Kidnapped Fishmonger at Rajahmundry Central Jail : రాజమండ్రి కేంద్ర కారాగారం వద్ద చేపల వ్యాపారి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఒడిశాలోని ఖోరాడ జిల్లాకు చెందిన సంజయ్ కళాసీ అనే చేపల వ్యాపారి కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో పలు ఛీటింగ్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఓ కేసులో తుని న్యాయస్థానం నిందితుడికి రిమాండ్ విధించింది. కేంద్ర కారాగారంలో రిమాండులో ఉన్న కళాసీకి బెయిల్ రావడంతో బుధవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యాడు. కారాగారం బయట నిరీక్షిస్తున్న కళాసీని కొందరు వ్యక్తులు బలవంతంగా కారులో ఎత్తుకెళ్లారు.
ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. కోనసీమకు చెందిన చేపల చెరువుల రైతులు కళాసీని కిడ్నాప్ చేశారని అతడి బంధువు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు అమలాపురం వద్ద సంజయ్ కళాసీని గుర్తించినట్లు తెలుస్తోంది. నిందితుడు పలువురు రైతులకు కోట్ల రూపాయల వరకు బకాయి ఉన్నట్లు సమాచారం.