బోరు వేస్తే నీరు రాలేదు-మంటలు వచ్చాయ్! ఉలిక్కిపడిన గ్రామస్థులు - Fires Erupting From Bore Well
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 22, 2024, 4:37 PM IST
Fires Erupting From Bore Well in Ambedkar Konaseema District : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బోరు బావి నుంచి మంటలు చెలరేగాయి. దిండి కాసవారపులంకలో రెండు రోజుల క్రితం ఆక్వాసాగు కోసం వేసిన బోరు నుంచి సోమవారం అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో గ్రామస్థులు ఒకసారిగా ఉలిక్కిపడ్డాయి. బోరుబావి నుంచి వచ్చే మంటలు ఆర్పడానికి తీవ్రంగా శ్రమించారు. వారు ఎంత శ్రమపడిన మంటలు ఆర్పలేకపోయారు.
దిండి గ్రామంలో రొయ్యల సాగు కోసం సుమారు 160 అడుగుల మించి బోరు వేస్తారు. ఆ నీటిని ఆక్వా సాగు కోసం వినియోగిస్తారు. అలాంటి బోరు నుంచి మంటలు రావడంతో ఆక్వా రైతులు ఆందోళన చెందారు. బోరుబావిలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మంటలు ఎగసిపడుతునే ఉన్నాయి. దీంతో చేసింది ఏమి లేక స్థానికులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బోరుబావి నుంచి వస్తున్న మంటలను ఆర్పేశారు. అనంతరం ఓఎన్జీసీ సిబ్బందికి సమాచారం అందించారు.