గాజువాకలోని ఆకాష్ బైజూస్ అకాడమీలో భారీ అగ్నిప్రమాదం - ఆకాష్ బైజూస్ అకాడమీలో అగ్నిప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 1:09 PM IST

Fire Accident in Akash Byjuce Accademy gajuwaka : విశాఖ జిల్లా కొత్త గాజువాకలోని ఆకాష్ బైజూస్ అకాడమీలో (Akash Byjuce Accademy) భారీ  అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ షార్ట్ సర్క్యూట్ జరిగి రెండవ అంతస్థలో మంటలు చెలరేగాయి. భవనం నుంచి దట్టమైన పొగలతో కూడిన అగ్నికీలలు ఎగిసి పడ్డాయి. ఆధునిక యంత్రాలతో కూడిన 3 ఫైర్ ఇంజన్లతో ఘటనస్థలానికి అగ్నిమాపక సిబ్బంది (Fire fighters) మంటలు ఆర్పేందుకు తీవ్రంగా యత్నించారు. రెండు గంటల శ్రమ తరువాత మంటలు అదుపులోకి తెచ్చారు.  

Fire Accident in Gajuwaka Akash BYJUs Institute : కమర్షియల్ కాంప్లెక్స్​లో ఫైర్‌ సేఫ్టీకి సంబంధించిన యంత్రాలేవి లేకపోవడంతో మూడు అంతస్తులు అగ్నికి (Fire) ఆహుతయ్యాయి. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. మంటల్లో తగలబడుతున్న కంప్యూటర్లు, స్టడీ మెటీరియల్స్​ చూసి సిబ్బంది ఆందోళన చెందారు. భవనంలోని గోడలు క్రాక్‌ ఇవ్వడంతో సిబ్బంది, పోలీసులు (Police) సమీపంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం కలగలేదని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.