మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే శిరీష - ఐదేళ్ల తర్వాత వంశధార కాలువకు సాగునీరు - Farmers Puja to Vamsadhara Water - FARMERS PUJA TO VAMSADHARA WATER
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 6, 2024, 2:02 PM IST
|Updated : Jul 6, 2024, 2:49 PM IST
Farmers Puja to Vamsadhara Water in Palasa : శ్రీకాకుళం జిల్లా పలాస రైతులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ఐదేళ్ల తర్వాత వంశధార కాలువ నుంచి సాగునీరు రావడంతో టెక్కలి వద్ద గంగమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరికాయ కొట్టి, నీటిలో పాలు, పసుపు, కుంకుమ కలిపారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా కాలువ ద్వారా నీరు రాలేదని ఆరోపించారు.
గత ఐదు సంవత్సరాల్లో నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడ్డామని రైతులు వాపోయారు. అప్పటి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి సీదరి అప్పలరాజు ఉన్నా ఈ విషయాన్ని పట్టించుకోలేదని అన్నారు. దీంతో ఈ ఐదేళ్లు తాము బిక్కుబిక్కుమంటూ కాలం గడిపామని చెప్పారు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం, తెలుగుదేశం ఎమ్మెల్యే గౌతు శిరీష ఒక్క నెలలోనే నీరు ఇప్పించారని సంతోషం వ్యక్తం చేశారు. ఆమె తమకు మంచి చేయాలని ఈ పనికి శ్రీకారం చుట్టారని ఇందుకు అధికార యంత్రాంగం కూడా సహకరించారని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.