వెలుగులోకి వైఎస్సార్సీపీ ఫేక్‌ స్పోర్ట్స్‌ సర్టిఫికెట్ల దందా- అనర్హులకు ఉద్యోగాలు - Fake Certificates Filling Govt Jobs - FAKE CERTIFICATES FILLING GOVT JOBS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 4:54 PM IST

Fake Sports Certificates in Filling Government Jobs Under YSRCP Regime : వైఎస్సార్సీపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్పోర్ట్స్‌ కోటా ఫేక్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇవ్వడంతో తమకు అన్యాయం జరిగిందని ప్రకాశం జిల్లా క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయాల్లో అనర్హులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. దొంగ సర్టిఫికెట్స్‌తో ఉద్యోగాలు పొందినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రీడా సంఘాలు ఒంగోలు కలెక్టరేట్‌లో అధికారులకు ఫిర్యాదు చేశారు.ఫేక్ సర్టిఫికెట్లతో మెరిట్ ఉన్న స్పోర్ట్స్ క్రీడాకారులను తొలగించి, నకిలీ సర్టిఫికెట్లు తెచ్చిన వారికి ఉద్యోగాలు కల్పించారన్నారు.

ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరవైందని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు. తక్షణమే వీటిపై స్పందించి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు కోరుతున్నారు. అర్హత కలిగిన వారికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.