నకిలీ బంగారంతో లోన్ - తాను పని చేస్తున్న బ్యాంక్‌లోనే అప్రైజల్ అతి తెలివి - Fake Gold To Loan Appriser cheating - FAKE GOLD TO LOAN APPRISER CHEATING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2024, 1:04 PM IST
Fake Gold To Loan Appriser Cheated in Bank in Satyasai District : కంచె చేను మేసిన చందంగా బ్యాంక్ అప్రైజల్ తాను పని చేస్తున్న బ్యాంకులోనే నకిలీ బంగారంతో అప్పు తీసుకొని అధికారులను మోసగించాడు. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడ్తారు అన్ని రీతిన బండారం బయటపడి ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పనిచేస్తున్న బ్యాంకులోనే నకిలీ బంగారంతో అప్పుతీసుకొని అధికారులను మోసగించిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంటలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్న రామాచారి నకిలీ బంగారంతో లక్ష 16 వేల రూపాయలు ఒక రైతు పేరు మీద అప్పు తీసుకున్నాడు. ఆడిట్ సమయంలో రామచారి తనఖా పెట్టిన బంగారం నకిలీ అని తేలడంతో ఆ విషయాన్ని బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆడిట్ అధికారుల ఒత్తిడితో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామాచారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.