తెలుగు యువత జిల్లా కార్యదర్శిపై పిన్నెల్లి దాడి - మరో కేసు నమోదు - One More Case on EX MLA pinnelli - ONE MORE CASE ON EX MLA PINNELLI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 9:54 AM IST
One More Case on EX MLA Pinnelli Ramakrishna Reddy : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. రామకృష్ణారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నా తన దాదాగిరీ వీడలేదు. పోలీసులు కోర్టు లోపలికి తీసుకెళ్తున్న తరుణంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి కొమెర శివ ఆయనతో కరచాలనం చేయడానికి ప్రయత్నించారు. అందుకు నిరాకరించిన పిన్నెల్లి శివ కడుపులో బలంగా కొట్టారు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని పోలీసులు వెంటనే బాధితుడిని పక్కకు తీసుకెళ్లారు. అంతకు ముందు వైద్య పరీక్షల నిమిత్తం తనను ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా చిత్రీకరిస్తున్న స్థానిక కెమెరామన్ పైనా పిన్నెల్లి దాడికి యత్నించారు.
తనపై మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడికి పాల్పడ్డారని కొమెర శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 308 కింద కేసు నమోదు చేసినట్లు మాచర్ల టౌన్ పోలీసులు తెలిపారు. పోలీసులు పిన్నెల్లిని మాచర్ల కోర్టుకు తీసు కొచ్చిన సమయంలో టీడీపీ నేతలు కొందరు పట్టణంలో బాణసంచా కాల్చి, సంబరాలు చేసుకున్నారు.