తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన మాజీ మంత్రి - స్థాయి విస్మరించి భాషా ప్రయోగం - Balineni Srinivasa Reddy - BALINENI SRINIVASA REDDY
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-07-2024/640-480-21962174-thumbnail-16x9-ysrcp-leader-balineni.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 16, 2024, 7:29 AM IST
EX Minister Balineni Srinivasa Reddy Comment on TDP MLA Damachrala Janardhan : తెలుగుదేశం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై వైఎస్సార్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తన వియ్యంకుడు నిర్మిస్తున్న శ్రీకర విల్లాల్లోకి దౌర్జన్యంగా మనుషుల్ని పంపారని బాలినేని ఆరోపించారు. విల్లాల్లో ఎటువంటి అక్రమాలు లేవన్నారు. కొంత మంది దౌర్జన్యంగా తమ విల్లాల్లోకి వస్తున్నారని బూతులు తిడుతూ బాలినేని రెచ్చిపోయారు
మీడియా సాక్షిగా బాలినేని వ్యాఖ్యలు :
" శిలా ఫలకాలు ధ్వంసం చేస్తున్నారు. విగ్రహాలు పగులగొడుతున్నారు. కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. కేసులు పెడుతున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇలాగైతే చూస్తూ ఊరుకోం. దమ్ముంటే నాతో పెట్టుకోండి. మేం తెగిస్తే దేనికైనా సిద్ధం. నేను, నా కుమారుడు ఊరొదిలి పోయామని ఛోటాగాళ్లతో బోర్డులు పెట్టించారు. మా వియ్యకుండి విల్లాల ప్రాజెక్ట్ కి దౌర్జన్యంగా పంపిస్తున్నారు. చెప్పుతో కొడతా. ఎవడొస్తాడో రండి. దమ్ముంటే నేరుగా నాతో రండి" అయిదుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రిగా పనిచేసి, ప్రకాశం జిల్లాలోనే అత్యంత సీనియర్ రాజకీయవేత్తగా పేరొందిన బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా సాక్షిగా చేసిన వ్యాఖ్యలివి.