రామోజీరావుకు ఆర్మీ మాజీ ఉద్యోగుల ఘన నివాళి - tribute to Ramoji Rao - TRIBUTE TO RAMOJI RAO

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 16, 2024, 8:15 PM IST

Ex Army employees paid tribute to Ramoji Rao: నందిగామలో ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుకు ఘనంగా నివాళులర్పించారు. మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో, మాజీ సైనికుల భవనంలో రామోజీరావు సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు.  రామోజీరావుకు చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. నందిగామకు చెందిన పలువురు న్యాయవాదులు, విద్యావేత్తలు, మాజీ సైనికులు, పట్టణ ప్రముఖులు పాల్గొని రామోజీరావుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తులు మాట్లాడుతూ రామోజీరావు వ్యక్తి కాదని ఒక వ్యవస్థని కొనియాడారు. నీతిగా నిజాయితీగా సమర్థవంతంగా అనేక వ్యాపారాలను ప్రారంభించారని  పేర్కొన్నారు. ప్రారంభించిన ప్రతి సంస్థను విజయపదంలో నడిపించారని కొనియాడారు. గత ప్రభుత్వాలు ఆయనను ఎన్ని ఇబ్బందుల పెట్టిన వెనుకఅడుగు వేయలేదన్నారు. ఈనాడు, ఈటీవీ చానల్స్ ద్వారా ప్రజా సేవే పరమావధిగా పని చేశారని కొనియాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఎనలేని కృషి చేశారని కొనియాడారు.  రామోజీరావు మన మధ్యలేకపోయినా ఆయన ఆశయాలను రామోజీరా సంస్థలు కొనసాగిస్తాయని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.