రేపు అమ్మవారి మూలానక్షత్రం - ఇంద్రకీలాద్రికి పోటెత్తనున్న భక్తులు
🎬 Watch Now: Feature Video
Vijayawada CP Rajasekhar Babu Interview : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇంద్రకీలాద్రి పరిసరాలతో పాటు మొత్తం ఆలయంలో భక్తుల రద్దీని సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిశితంగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 4500 మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. 18 చోట్ల ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశాsరు. కేశఖండన కోసం షిప్టుకు 200 మంది క్షురకులను అందుబాటులో ఉంచారు. నదీ స్నానాలు కాకుండా సీతమ్మ వారి పాదాల వద్ద భారీగా షవర్లు ఏర్పాటు చేశారు. కృష్ణానది పవిత్ర హారతుల దృష్ట్యా దుర్గా ఘాట్ వద్దకు భక్తులను అనుమతించడం లేదు.
అమ్మవారి మూలానక్షత్రం రోజున బుధవారం ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ్టి నుంచే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక హోల్డింగ్ ఏరియాలతోపాటు అదనపు బలగాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ట్రాఫిక్ నియంత్రణకు 'అస్త్రం' అనే మొబైల్ యాప్‌ను రూపొందించారు. నేరస్తుల చేతివాటం నియంత్రించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్నీ వినియోగిస్తున్నారు. బందోబస్తు ఏర్పాట్లపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి శ్రీనివాసమోహన్ ముఖాముఖి