ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం - మంత్రి నాదెండ్ల మనోహర్ ఏమంటున్నారంటే! - FREE GAS CYLINDER
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 29, 2024, 3:56 PM IST
Minister Nadendla Manohar Interview on Free Gas Cylinder Scheme Distribution : ఎన్నికల హామీలను ఒక్కటొక్కటిగా ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పండగ దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆధార్, రేషన్ కార్డు ఉన్న ప్రతి గ్యాస్ వినియోగదారుకు రూ.851 రాయితీ రానుంది. నాలుగు నెలలకొక సిలిండర్ చొప్పున ఏటా 3 ఉచిత సిలిండర్లు పంపిణీ చేయనున్నారు.
నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు మొదటి సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రెండో విడతలో ఏప్రిల్ 1 నుంచి జులై 30 వరకూ, మూడో విడతలో ఆగస్టు 1 నుంచి నవంబర్ 31 వరకూ , నాలుగో విడత 2025 డిసెంబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకూ బుకింగ్ చేసుకునే సౌకర్యం ఇచ్చిందని అన్నారు. నవంబరు ఒకటో తేదీ శ్రీకాకుళం జిల్లా ఈడుపురం గ్రామంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు లాంఛనంగా ప్రారంభించబోతున్నారని తెలిపారు. ఉచిత వంటగ్యాస్ సిలెండర్ల పథకం గురించి నాదెండ్ల మనోహర్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.