వరదల వల్ల రాష్ట్రంలో లక్షన్నర లక్షల హెక్టార్లలో పంటనష్టం: అచ్చెన్నాయుడు - Floods Damage in AP - FLOODS DAMAGE IN AP
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-09-2024/640-480-22398407-thumbnail-16x9-achemnaidu.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2024, 2:24 PM IST
ETV Bharat Interview With Ministers Atchannaidu And Anagani Satya Prasad : బుడమేరు సృష్టించిన జల విలయంతో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు కకావికలమయమయాయి. విజయవాడ నగరాన్ని చిగురుటాకులా వణికించిన బుడమేరు, నగరాన్ని దాటిన తర్వాత పంట పొలాలను ముంచెత్తింది. వరద ఉధృతి కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. దీంతో వరి చెరకు, మొక్కజొన్న, కూరగాయలు సాగు చేసే రైతులకు అపార నష్టం వాటిల్లింది. గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో వచ్చిన వరద తమని నిండా ముంచేసిందని రైతులు వాపోతున్నారు.
Floods Damage in AP : వరదల వల్ల లక్షన్నర హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక అంచనాకు వచ్చామని, ఈ వివరాలను ఇవాళ కేంద్రానికి అందజేయనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకునే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని హామీ ఇచ్చారు.విపత్తు జరిగి ప్రజలంతా అల్లాడిపోతుంటే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం బెంగళూరు తిరుగుతూ, లండన్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేయడం విచారకరమని ఆయన విమర్శించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వసాయం అందిస్తామని మరోసారి స్పష్టం చేశారు. వరదల కారణంగా వచ్చిన నష్టాన్ని అంచనా వేయడంలో రెవెన్యూ శాఖ పూర్తిగా నిమగ్నమై ఉందని ఆ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. నష్టపోయిన రైతలను, అన్ని వర్గాల వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు.