విమానయాన రంగాన్ని సామాన్యులకు మరింత చేరువ చేస్తాం: రామ్మోహన్ నాయుడు - Civil Aviation Minister - CIVIL AVIATION MINISTER
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 11, 2024, 4:50 PM IST
Civil Aviation Minister Rammohan Naidu: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడు మెుదటి సారిగా ఈటీవీ భారత్తో మాట్లాడారు. భోగాపురం సహా, రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలనూ అభివృద్ధిలోకి తీస్తామని పేర్కొన్నారు. సామాన్యులకు విమానయాన రంగాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా తన పని ఉంటుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడమే తన లక్ష్యం అని పేర్కొన్నారు.
గతంలో సైతం అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి పౌరవిమానయాన సేవలను విస్తరించారు. ఏపీకి అవసరమైన నిధులను తీసువచ్చే విషయంలో కష్టపడి పనిచేస్తామని పేర్కొ న్నారు. ఎన్డీఏతో పొత్తు వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని వెల్లడించారు. ప్రధాని మోదీతో కలిసి ముందుకు సాగుతాం అని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగుతామని పేర్కొన్నారు. కేంద్రంలోని అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ, రాష్ట్రానికి నిధులు తీసుకొస్తామంటున్న రామ్మోహన్ నాయుడుతో ఈటీవీ భారత్ ముఖాముఖి