'సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం'- ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లకు పురందేశ్వరి హామీ - Petition to BJP State President

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 5:16 PM IST

Engineering Assistants Petition to BJP State President Daggubati Purandeswari : రాష్ట్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ప్రతినిధులు తమ సమస్యల గురించి పురందేశ్వరికి వినతిపత్రం అందజేశారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లకి పదోన్నతి లేదని, కనీసం టెక్నికల్ పే స్కేల్ అమలు చేసేలా చూడాలని కోరారు.

వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లోని ఉద్యోగుల సేవలను హేతుబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి న్యాయం జరిగేలా చూస్తానని పురందేశ్వరి వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పురందేశ్వరి వారితో మాట్లాడారు. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు (Engineering Assistants) తమకు ఇంకే సమస్య ఎదురైనా పరిష్కరించి అండగా ఉంటానని తెలుపారు. త్వరలోనే తమ సమస్యలు తీరేలా చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర  అధ్యక్షురాలు (BJP State President) తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.