సింహాచలంలో దేవాదాయశాఖ కమిషనర్ పర్యటన - పలు అభివృద్ధి పనుల పరిశీలన - Satyanarayana Visit Simhachalam - SATYANARAYANA VISIT SIMHACHALAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 4, 2024, 2:27 PM IST
Endowment Commissioner Inspect Simhachalam Works : ప్రసాద్ పథకం పేరిట విశాఖ జిల్లా సింహాచలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ పరిశీలించారు. రూ.54 కోట్లతో కేంద్ర ప్రభుత్వం సింహగిరిపై ప్రసాద్ స్కీం పేరిట అభివృద్ధి పనులు చేపట్టింది. కొండ దిగువన ఉన్న పుష్కరిణి సత్రం, కళ్యాణ మండపం, ఘాట్‌రోడ్డులోని వై జంక్షన్, క్యూ కాంప్లెక్స్‌ను ఆయన పరిశీలించారు. యాంపీ థియేటర్, అన్నదానం కోల్డ్ స్టోరేజ్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. నాణ్యతలో రాజీపడకుండా త్వరతిగతిన పనులు పూర్తిచేయాలని సత్యనారాయణ ఆదేశించారు.
Commissioner Satyanarayana Visit Simhachalam Temple : అంతకుముందు కమిషనర్ సత్యనారాయణ సతీసమేతంగా వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనము తర్వాత బేడ మండపము ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామివార్లకు వారు ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం పండితులు దంపతులకు తీర్థప్రసాదాలు ఇచ్చి వేదాశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఈఓ శ్రీనివాసమూర్తి, ఈఈలు శ్రీనివాసరాజు, రాంబాబుతో పలువురు అధికారులు పాల్గొన్నారు.