పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఏం బ్యాలెట్ - ఉద్యోగులకు మళ్లీ పోలింగ్ చేపట్టాలని ఈసీ ఆదేశం - Postal Ballot Issue in Ap - POSTAL BALLOT ISSUE IN AP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2024, 9:23 AM IST

Election Commission Orders on Postal Ballot Issue : పోస్టల్‌ బ్యాలెట్ ఓటింగ్‌ ప్రక్రియపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా అధికారులు తీరు మారడం లేదు. వరుసగా మూడో రోజూ రాష్ట్రంలో ఉద్యోగులకు అవస్థలు తప్పలేదు. తమ ఓటెక్కడ ఉందో తెలియక.. చాలా మంది ఇబ్బందులు పడ్డారు.  మరో వైపు  పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఏం బ్యాలెట్ ఇచ్చారు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఏం బ్యాలెట్ ఇచ్చిన ఘటనలో మళ్లీ పోలింగ్ చేపట్టాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 1219 ఓటర్లను మళ్లీ పిలిచి ఓట్లు నమోదు చేయించాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశాలిచ్చింది. ఎన్నికల విధుల్లోకి వెళ్లే ముందే 1219 మంది ఓటర్​ల నుంచి పోస్టల్ బ్యాలెట్​లు నమోదు చేయాలనీ స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్ పేపరుపై ఓటు నమోదు చేయడం వల్ల ఆ ఓట్లు చెల్లకుండా పోయాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సదరు ఓట్లను అలాగే భద్రపరచాలనీ సూచనలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఈఓ కి ఆదేశాలిచ్చింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.