జనసేనకు గ్లాసు సింబల్ కేటాయిస్తూ ఈసీ ఆదేశాలు - Janasena Glass Symbol - JANASENA GLASS SYMBOL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 28, 2024, 10:16 PM IST
Janasena Glass Symbol: జనసేన పార్టీకి కామన్ సింబల్ గా గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు అన్ని జిల్లా కలెక్టర్లకూ కామన్ సింబల్ కేటాయింపుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీకే గ్లాసు గుర్తు కేటాయించేలా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల గుర్తుల కేటాయింపు నిబంధనల్లోని పారా 10 బి ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ గ్లాసు గుర్తును జనసేనకు మాత్రమే కేటాయించేలా ఈసీ ఆదేశాల్లో పేర్కోంది. మరోవైపు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు చెందిన పార్టీ జైభారత్ నేషనల్ పార్టీకి కూడా టార్చిలైటు గుర్తును, బీసీవై పార్టీ రామచంద్రయాదవ్ కు చెరకు రైతు గుర్తును, మరో 35 పార్టీలకు అన్ని నియోజకవర్గాల్లోనూ కామన్ సింబల్ వర్తింప చేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. షెడ్యూలు విడుదల కంటే ముందు గ్లాసు గుర్తును ఈసీ ఫ్రీ సింబల్స్ జాబితాలో పేర్కోంది. ప్రస్తుతం ఈ గుర్తును జనసేనకు మాత్రమే కేటాయించేలా ఉత్తర్వులు ఇచ్చారు.