ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఈవీఎంల ద్వారా ఓటు అవగాహన సదస్సు - Eenadu Etv vote Registrationprocess
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 9:54 AM IST
Eenadu- Etv voter Registration Awareness Process: ఓటు హక్కు వినియోగమంటే మన భవిష్యత్తు కోసం పరిణతితో తీసుకునే నిర్ణయమని ప్రభుత్వ అధికారులు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో పలు కళాశాలల విద్యార్థులకు ఓటు చైతన్యంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. విజయనగరం, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలోని పలు కళాశాలల్లో విద్యార్థులకు ఓటు నమోదుపై చైతన్యం కలిగించారు. ఈవీఎంల ద్వారా ఓటు ఎలా వేయాలో విజయనగరం జిల్లాలోని వేణుగోపాలపురం డైట్ ట్రైనింగ్ కళాశాల విద్యార్థులకు ఎన్నికల అధికారి సత్యనారాయణముర్తి తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
ఓటరు నమోదుతోపాటు పోలింగ్ శాతాన్ని పెంచే బాధ్యతను యువత తీసుకోవాలని కోరారు. ఓటు మనకెందుకులే అనుకుని నిర్లక్ష్యం చేస్తే భావితరాలు ఇబ్బంది పడతాయన్నారు. చిత్తూరులోని విజయం డిగ్రీ కళాశాలలో 18 ఏళ్లు నిండిన విద్యార్థులు డ్వామా పీడీ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఫారం-16 నింపి ఓటు నమోదు చేసుకున్నారు. సమర్థులను ఎన్నుకునేందుకు నిజాయతీగా ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలమన్నారు. పలువురు యువత ఓటు హక్కు వినియోగంపై తమ అభిప్రాయాల్ని వెల్లడించారు.