అమ్మఒడి సాయాన్ని ఆయా సంస్థలకు ఫీజులుగా చెల్లించాలని ఉత్తర్వులు- తల్లులకు విద్యాశాఖ ఆదేశాలు - అమ్మఒడి సాయంపై విద్యాశాఖ ఆదేశాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 8:49 AM IST
Education Department Orders on Amma Vodi Funds: నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు అమ్మఒడి(Jagananna Amma Vodi Scheme) ఆర్థిక సాయాన్ని ఆయా సంస్థలకు ఫీజులుగా చెల్లించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సమగ్ర శిక్షా డైరెక్టర్ శ్రీనివాస్ అత్యవసర నోట్‌ను జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించారు. అమ్మఒడి ఆర్థిక సాయం అందుకున్న తల్లులు రెండేళ్లకు చెందిన స్కూలు ఫీజుల్ని చెల్లించాలని పేర్కొంటూ ఆయన ఉత్తర్వులు ఇచ్చారు.
మూడు రోజుల్లోగా ఈ మొత్తాన్ని ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు చెల్లించేలా ఎంఈఓ(MEO)లు బాధ్యతలు తీసుకోవాలని సమగ్ర శిక్ష డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అమ్మఒడి ఆర్ధిక సాయం పొందిన 60 రోజుల్లోగా విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాలల ఫీజు చెల్లించకపోతే ప్రభుత్వమే ఆ పథకం నుంచి నిధుల్ని మినహాయించి ఆ మొత్తాన్ని చెల్లిస్తుందని గతేడాది ఆదేశాలు ఇచ్చారు. పట్టణప్రాంతాల్లో 8 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో 6వేల 5వందలు, గిరిజన ప్రాంతాల్లో 5వేల వంద ఒక్కో విద్యార్థికి వ్యయం అవుతుందని అంచనా వేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.