ఎగ్జిట్‌ పోల్స్‌పై ఈసీ నిషేధం- ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే! - EC ban on exit polls in media

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 30, 2024, 10:54 AM IST

EC orders ban on exit polls in media: సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఏపీలో నోటిఫికేషన్ తేదీ మరుసటి రోజు నుంచి ఫలితాల వెల్లడికి ముందు రోజు వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 19 తేదీ ఉదయం 7 గంటల నుంచి జూన్ 1 తేదీ సాయంత్రం 6.30 గంటల వరకూ ప్రసార మాధ్యమాల్లో ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది. పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో సామాజిక మాధ్యమాల్లో నూ ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇవ్వడం పై నిషేధం వర్తిస్తుందని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ నిర్దేశించిన తేదీల మధ్య ఒపీనియన్ పోల్, పోల్ సర్వే తరహా ఎన్నికల సంబంధిత నిర్ణయాలు వెలువరించవద్దని పేర్కొంటూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీలో జరిగే లోక్​సభ, శాసన సభ ఎన్నికల తో పాటు 13 రాష్ట్రాలలో జరిగే ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వొద్దని సూచనలు జారీ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.