పోలింగ్‌ కేంద్రాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి- వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం- ఈసీ - EC Guidelines for ceo - EC GUIDELINES FOR CEO

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 3:58 PM IST

EC Guidelines For Heat Wave: వేసవి తీవ్రత దృష్ట్యా సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సీఈఓలకు (Chief Electoral Officer) ఈసీ సూచనలు జారీచేసింది. మార్చి నుంచి జూన్‌ వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు ఐఎండీ (IMD) పేర్కొందని ఈసీ (Election Commission) వెల్లడించింది. 

Election Commission Instructions: వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించినట్లు పేర్కొంది. ఎండ తీవ్రత, వడగాల్పుల దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు జారీచేసింది. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో (Polling Center) తగినంత నీడ ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. తాగునీటి సౌకర్యం, అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు (Guidelines), సూచనలు జారీ చేసింది.

మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్​ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. దేశ వ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరగనుండగా మే 13న నాలుగో విడతలో భాగంగా ఏపీ, తెలంగాణలో పోలింగ్ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.