గతేడాది ఖరీఫ్ ఇన్‌పుట్ సబ్సిడీ నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరణ - Input Subsidy funds Disbursing - INPUT SUBSIDY FUNDS DISBURSING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2024, 9:22 PM IST
Input Subsidy funds Disbursing: వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం నుంచి మరో షాక్ తగిలింది. గతేడాది ఖరీఫ్ సీజన్లో కరువు కారణంగా రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రతిపాధనకు ఎన్నికల అధికారులు అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ రూ. 847 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ నిధుల పంపిణీ నీ నిలుపుదల చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 2023 ఖరీఫ్ సీజన్ లో కరవు కారణంగా 6,95,897 లక్షల మంది రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని వ్యవసాయ, ఉద్యాన శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలిచ్చింది. సీఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన స్క్రీనింగ్ కమిటీ లో ఈ అంశంపై చర్చించి ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించేందుకు ఎన్నికల సంఘం ఆమోదం కోసం పంపింది. ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకూ ఇన్ పుట్ సబ్సిడీ నిలుపుదల చేయాలని ఆదేశించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ .640 కోట్ల విద్యా దీవెన పథకం నిధుల విడుదల పైనా స్క్రీనింగ్ కమిటీ లో నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకూ విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధుల విడుదలను సైతం వాయిదా వేయాలని ఈసీ అధికారులకు సూచించింది.