ప్రపంచంలో విషం లేని పాములే ఎక్కువ - ప్రజల్లో అవగాహన పెంచుతున్న EGWS - Eastern Ghats Wildlife Society

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2024, 3:50 PM IST

thumbnail
మీకు తెలుసా? ప్రపంచంలో విషం లేని పాములే ఎక్కువ! (ETV Bharat)

Eastern Ghats Wildlife Society Awareness on Snake Bites :  ప్రపంచంలో పాటుకాటు మరణాలు భారత్‌లోనే ఎక్కువ. అయితే ఇదంతా అవగాహనలేమి కారణంగానే జరుగుతున్నాయని అంటోంది తూర్పు కనుమల సొసైటీ సంస్థ (Eastern Ghats Wildlife Society-EGWS). యువత, అటవీ శాఖ అధికారుల భాగస్వామ్యంతో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తుంది ఆ సంస్థ. పాములను సంరక్షిస్తున్న తూర్పు కనుమల సొసైటీ యువతతో కలసి పలు రెస్క్యూ అపరేషన్లు నిర్వహిస్తుంది ఈ సంస్థ.

ప్రపంచంలో  విషం లేని పాములే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు వీరు. గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సంస్థ పాము కాటుకు వైద్యుడిని మాత్రమే సంప్రదించాలని తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆసక్తి గల యువతకు పాముల సంరక్షణపై శిక్షణ ఇస్తున్నారు. అలాగే అరుదైన సరీసృప జాతులను సంరక్షించడానికి చర్యలు చేపడుతోంది. మరి, ఆ సంస్థ చేసే ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయి? ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారో వాళ్ల మాటల్లోనే తెలుసుకుందాం. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.