'మహిళలపై దాడులు, గంజాయి రవాణా వంటి అంశాల్లో కఠినంగా వ్యవహరించాలి' డీజీపీకి పవన్​ సూచనలు - Dwaraka TirumalaRao Meets Pawan

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 9:47 AM IST

Dwaraka Tirumala Rao Meets Deputy CM Pawan Kalyan : డీజీపీ (DGP) గా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​తో భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, పోలీసింగ్​కు సంబంధించిన అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చాయి. మహిళలపై దాడులు, గంజాయి రవాణా వంటి అంశాల్లో కఠినంగా వ్యవహరించాలని పవన్ సూచించినట్లు సమాచారం.

"త్వరలోనే పోలీసు యంత్రాంగం మొత్తాన్ని ప్రక్షాళన చేస్తాం. పోలీసింగ్లో లో స్పష్టమైన మార్పు కనిపించాలి. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల రక్షణకు అగ్ర ప్రాధాన్యమివ్వాలి" అని ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు డీజీపీ సీహెచ్. ద్వారకా తిరుమలరావును ఆదేశించారు.  ప్రజా రవాణాశాఖ కమిషనర్, ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయనను ప్రభుత్వం డీజీపీగా నియమించింది. ఆర్టీసీ బాధ్యతలను కూడా మళ్లీ ఆయనకే అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్​కుమార్​ ప్రసాద్ శుక్రవారం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.