సెల్ ఫోన్ మాట్లాడుతూ ఓటు వేయవచ్చా? - Duvvada used phone at polling Booth - DUVVADA USED PHONE AT POLLING BOOTH
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 13, 2024, 9:44 PM IST
Duvvada Srinivas Used Cell Phone in Polling Station at Tekkali : ఓటర్లెవరూ పోలింగ్ కేంద్రాలకు మొబైల్ ఫోన్లు తేవద్దని ఎన్ని సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన వైఎస్సార్సీపీ నేతలు మాత్రం వాటిని బేఖాతరు చేయడం లేదు. ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘించి టెక్కలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ కేంద్రంలో సెల్ ఫోన్ వాడటం వివాదస్పదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు సాయంత్రం ఓటు హక్కును వినియోగించుకోవడానికి టెక్కలిలో ఉన్న పోలింగ్ బూత్‌కు వచ్చారు. బూత్‌లో సెల్ ఫోన్ ఉపయోగించటం నిషేధం ఉన్నప్పటికి లెక్కచేయకుండా అందరూ చూస్తుండగానే ఫోన్ వాడారు.
అంతేగాక సెల్ ఫోన్లో మాట్లాడుతూనే తన ఓటు హక్కును వినియోగించటం వివాదస్పదంగా మారింది. అక్కడే ఉన్న ఎన్నికల సిబ్బంది దువ్వాడ శ్రీనివాస్‌ను నిలువరించకుండా చూస్తూ ఉండిపోయారు. దీంతో దర్జాగా ఫోన్లో మాట్లాడుతూనే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లను వినియోగించుకున్నారు. దీన్ని చూస్తున్న అక్కడి ఓటర్లు ఈసీ నిబంధనలు కేవలం సామాన్యులకేనా అంటూ ముక్కున వేలేసుకున్నారు.