తెలుగు హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతున్న యువకుడు - వాయిస్ వింటే వారెవ్వా అనాల్సిందే - Dubbing Artist Adhyaa Hanumanthu - DUBBING ARTIST ADHYAA HANUMANTHU
🎬 Watch Now: Feature Video


Published : Sep 5, 2024, 4:38 PM IST
Dubbing Artist Adhyaa Hanumanthu Interview : చలాకీగా అచ్చం సాయిపల్లవిలా మాట్లాడేస్తున్న ఆ గొంతుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. సినిమాల్లో హీరోయిన్లు మాట్లాడే గొంతు చాలా బాగుంటుంది. ముఖ్యంగా తెలంగాణ యాసలో మాట్లాడితే ఇట్టే ఆకర్షితులవుతారు. అలా మాట్లాడి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది సాయిపల్లవి. మరి ఇంత అందంగా మాట్లాడేది ఓ అబ్బాయి అని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఇదొక్కటేనా నృత్యం, సంగీతం, నటన, చదువు ఇలా అన్నింటినిలోనూ వారెవ్వా అనిపిస్తున్నాడు. దాదాపు ఫిల్మ్ ఇండస్ట్రీలో 25మందికి డబ్బింగ్ చెప్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు.
చాలామంది హీరోయిన్స్‌కు వాయిస్ అందిస్తున్నాడు. తెలుగు భాషతో పాటు తమిళ, కన్నడాలో డబ్బింగ్ చెబుతున్నాడు. చదువుతో పాటు ఇండస్ట్రీలో ఎలా రాణించగలుగుతున్నారని అడగ్గా ఆసక్తి ఉంటే ఎలా అయినా అనుకున్న పనిని చేయగలం అంటున్నారు ఆద్య హనుమంతు. ఇలా రెండిటిలో ముందు రాడానికి ప్రొఫెసర్స్, ఫ్రెండ్స్ ఎంతో సహాయం చేస్తున్నారని చెబుతున్నాడు. ఎంబీబీఎస్ చదువుతూనే డబ్బింగ్ కళాకారుడిగా సత్తా చాటుతున్న ఆద్య హనుమంతుతో చిట్‌చాట్.