thumbnail

డీఎస్సీ 1998 అభ్యర్థుల ధర్నా - సమస్యను పరిష్కరిస్తామని ఆళ్ల రామకృష్ణారెడ్డి హామీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 4:20 PM IST

DSC Candidates Protest in Guntur District : గుంటూరు జిల్లా మంగళగిరిలో డీఎస్సీ 1998 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్​ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తానంటూ సీఎం​ జగన్​ మోహన్​ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మొత్తం 6 వేల పోస్టులకు గాను 4 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేసి మిగిలిన రెండు వేల మందికి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 4 వేల పోస్టులను ఓసీ అభ్యర్థులకు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాయలసీమ అభ్యర్థులకు అన్యాయం చేశారని డీఎస్సీ 1998 అభ్యర్థులు ఆరోపించారు. ఈ విషయాన్ని జగన్​ దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేదన్నారు. డీఎస్సీ అభ్యర్థులను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అభ్యర్థులు ధర్నాను విరమించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.