డ్రైవర్ల సమస్యలు పరిష్కరించే పార్టీకే మా మద్ధతు: జయహో రథసారథి డ్రైవర్ల సంఘం - డ్రైవర్ల సమస్యల పరిష్కారం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 12:01 PM IST
Drivers Petition to Congerss Party In Vijayawada : డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ఏ రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పొందుపరుస్తారో ఆ రాజకీయ పార్టీలకు డ్రైవర్లు మద్దతుగా నిలుస్తారని జయహో రథసారథి డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు వాసు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టం ఉపసంహరించుకునేలా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో కృషి చేయాలని కోరుతూ విజయవాడలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులు పల్లం రాజుకు వినతిపత్రం అందజేశారు.
పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ జీరో అవర్లో హిట్ అండ్ చట్టాన్ని ఉపసంహరించుకునేలా కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు పల్లంరాజు హామీ ఇచ్చారన్నారు. డ్రైవర్లు దేశ ప్రగతికి ఎంతో కృషి చేస్తున్నారని అటువంటి డ్రైవర్ల పట్ల కొన్ని ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.