తాగునీటి ఇక్కట్లు - గంటల తరబడి పడిగాపులు - కనిగిరిలో నిలిచిపోయిన నీటిని సరఫరా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 1:50 PM IST
Drinking Water Problems in Prakasam District : కనిగిరి పట్టణంతో పాటు నియోజవకర్గంలోని 250 గ్రామాలకు పైగా పైప్లైన్ ద్వారా నీటిని సరఫరా చేసే రామతీర్థం జలాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కుళాయిల వద్ద నీటి కోసం బిందెలతో బారులు దీరారు. రామతీర్థం పథకానికి సంబంధించిన విద్యుత్ తీగలు మరమ్మతులకు గురి కావడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ (RWS) డీఈ విశ్వనాథరెడ్డిని వివరణ కోరగా విద్యుత్తు సమస్య వల్ల నీటి సరఫరా నిలిచిపోయిందని సమస్య పరిష్కరించి యథావిధిగా నీళ్లు సరఫరా చేస్తామన్నారు.
Several areas in Prakasam district, Andhra face water scarcity : త్రాగునీరు పూర్తిగా నిలిచిపోవడంతో పట్టణంలోని సాగర్ నీటి సరఫరా కేంద్రం వద్ద ఒక్క కుళాయిలోనే ధారగా నీళ్లు వస్తూ ఉండడంతో ఆ నీటి కోసం స్థానిక ప్రజలు వాటర్ క్యాన్లు, బిందెలతో బారులు తీరారు. కనీసం గంట నుంచి రెండు గంటలపాటు క్యూలో ఉండి తాగునీరు (Drinking Water) నింపుకుంటున్నారు. వేసవి మొదలు కాకముందే త్రాగునీటి కొరతతో (water scarcity ) అవస్తలు పడక తప్పడం లేదని, రాబోయే వేసవి కాలంలో ఇంకెన్ని కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.