పెన్నమ్మ ఊట చెలిమలే దిక్కు- తాగునీటి సమస్యతో తీవ్ర ఇక్కట్లు - Drinking Water Problem - DRINKING WATER PROBLEM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 23, 2024, 2:21 PM IST
Drinking Water Problem in Darjipally at YSR District : వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం దర్జిపల్లి లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. గ్రామస్థులు అందరూ సమీపంలోని పెన్నా నదిలోని చెలమ నీటిని తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఇసుకలో చిన్నపాటి గుంతను తీసి అక్కడ వస్తున్న ఊట నీరును బిందెల్లో తోడుకొని మోసుకెళ్తున్నారు. గ్రామంలో అందుబాటులో ఒక బోర్ ఉన్నప్పటికీ ఆ బోరులో ఉప్పునీరు రావటంతో గత్యంతరం లేక సమీపంలోని పెన్నా నదిలో (Penna River) చెలిమ నీరు తెచ్చుకుని గొంతు తడుపుకొంటున్నారు.
అధిక జనాభా కలిగిన దర్జిపల్లికి మంచినీరు అందించాలని అధికారులకు ఏళ్ల తరబడి విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవటం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. వేరే గత్యంతరం లేకనే ఈ విధంగా పెన్నా నదిలోని చెలిమి నుంచి నీటిని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.