'మంచినీళ్లు కూడా ఇవ్వని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి'- ఖాళీ కుండలతో మహిళల నిరసన - అనంతపురంలో తాగునీటి సమస్య
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 5:46 PM IST
Drinking Water Problem In Anantapur District : అనంతపురంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన నిర్వహించారు. నగరపాలక సంస్థ ఎదుట ఖాలీ కుండలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, కుండలు పగులగొట్టి నిరసన (Protest) వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం నగరంలో కనీసం తాగునీరు (Drinking Water) కూడా సరఫరా చేయలేకపోతోందని ఆరోపించారు. ప్రజలపై అధిక పన్నుల భారం (Taxes) మోపుతూ, కొలాయిలకు నీటిని సక్రమంగా ఇవ్వటంలో నగరపాలక సంస్థ పూర్తిగా విఫలమైందన్నారు.
CPM & Womens Protest For Drinking Water : ప్రభుత్వానికి బుద్దిచెప్పటానికి ప్రజలు సిద్ధమయ్యారని సీపీఎం పార్టీ నేతలు (CPM Leaders) హెచ్చరించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించలేని స్పందన ఎందుకంటూ అధికారులపై సీపీఎం నేతలు , మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.