పుట్టపర్తిలో రచ్చకెక్కిన వైఎస్సార్సీపీ వర్గ విబేధాలు- ఇన్ఛార్జిని మార్చే యోచనలో నేతలు - Puttaparthi mla ticket
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 18, 2024, 7:07 PM IST
Dissenting Leaders Meeting On Puttaparthi Incharge Ticket: ఎలక్షన్ తేదీ ప్రకటించినా వైఎస్సార్సీపీ నేతల్లో ఇంకా సీట్లు విషయంలో అసమ్మతి జ్వాలలు కొనసాగుతున్నాయి. తాము చెప్పిన అభ్యర్థికి టిక్కెట్టు కేటాయించాలని లేకపోతే ఓటమి తప్పదని నేతలు అధిష్ఠానాన్ని హెచ్చరిస్తున్నారు. శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి వైఎస్సార్సీపీలో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే (MLA) శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ పలువురు నేతలు సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పుట్టపర్తి మాజీ సమన్వయకర్త కొత్తకోట సోమశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ (MPTC) ఇంద్రజిత్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేత చర్ల విజయ్ భాస్కర్ రెడ్డి తమ అనుచరులతో (followers) కలిసి సమావేశమయ్యారు. నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా సమస్యలు ఉన్నా శ్రీధర్ రెడ్డి పట్టించుకోలేదని విమర్శించారు. అభ్యర్థిని మార్చాలని మరోసారి అధిష్ఠానాన్ని దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. అధిష్ఠానాన్ని నిర్ణయానికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ (Activity) ఉమ్మడిగా ప్రకటిస్తామని నేతలు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి టికెట్ ఖరారు చేసే విషయంలో అధిష్ఠానాన్ని తమను సంప్రదించకపోవడం బాధాకరమన్నారు.