కోటప్పకొండ తిరునాళ్లలో అపశ్రుతి - ప్రమాదవశాత్తు పడిపోయిన 'ప్రభ' - Kotappakonda

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 9, 2024, 4:05 PM IST

Discord During Kotappakonda Mahashivratri Celebrations in Panladu District : పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కోటప్పకొండ తిరునాళ్ల ముగించుకొని తిరిగి వెళ్తుండగా చిలకలూరిపేట మండలం యడపల్లి వద్ద ' ప్రభ' ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి. రెండు ట్రాక్టర్లు ధ్వంసమయ్యాయి. ప్రభ కిందకు పడిపోవడం వల్ల గాయాలు అయిన జవ్వాజి నాగేశ్వరరావును స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎంతో సంతోషంగా త్రికోటేశ్వరస్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం స్థానికుల మనస్సు కలిచివేసింది.

Kotappakonda : కొండప్ప కొండ తిరునాళ్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విద్యుత్​ ప్రభలు చూపరులను ఆకట్టుకున్నా విషయం అందరికి తెలిసిందే. తిరునాళ్ల అనంతరం ప్రభను యడపల్లికి తీసుకెళ్తుండగా దారి మధ్యలో ఈ సంఘటన జరిగింది. యూటీ పవర్​ గ్రిడ్​ దాటిన వెంటనే యడవల్లి ప్రభ పడిపోయింది. కిందకు పడిపోయిన ప్రభను క్రేన్​ సహాయంతో పైకి లేపడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.