ట్రెండ్ మారింది గురూ- టీడీపీ తరఫున ఎలక్ట్రిక్ సైకిళ్లతో యువత ప్రచారం - ELECTION CAMPAIGN 2024 - ELECTION CAMPAIGN 2024
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 12:42 PM IST
NDA Alliance Election Campaign : వారం రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో మండుటెండలనూ లెక్కచేయకుండా కూటమి అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అధికార అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూనే ఆత్మీయ సమావేశాలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రచారాల్లో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచారంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్టీఏ కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారని, అభివృద్ధి పరుగులు తీస్తుందని హామీ ఇస్తూ ప్రజల్లో మమేకం అవుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లును అభ్యర్థిస్తున్నారు. జగన్ అరాచక పాలన అంతం చేయడానికి ప్రజలంతా సిద్ధమవ్వాలని సూచిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించుకుందాం అంటూ సినీ దర్శకుడు పగడాల మధు నేతృత్వంలోని ఓ యువబృందం వినూత్న ప్రచారం చేస్తోంది. ఎలక్ట్రిక్ సైకిళ్లతో వీరు చేస్తున్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో వీరు చేస్తున్న పల్లెపల్లెకీ, గడపగడపకీ వెలుతూ కూటమి గెలుపు కోసం కృషి చేస్తున్నారు.