'ఎమ్మెల్యే తిప్పేస్వామిని టీటీడీ బోర్డు పదవి నుంచి తొలగించాలి' - Allegations against MLA Thippeswamy
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-01-2024/640-480-20622563-thumbnail-16x9-differences-between-ysrcp-leaders.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 10:37 AM IST
Differences between YSRCP Leaders: అధికార వైఎస్సార్సీపీలో రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి జ్వాలలు రోజురోజుకు ఎగిసిపడుతున్నాయి. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైటీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే తిప్పేస్వామిపై అవినీతి ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేతో పాటు భార్య, కుమారుడు తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని, నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే రేటు నిర్ణయిస్తారని నేతలు ఆరోపించారు.
Allegations against MLA Thippeswamy : అధికారులను గుప్పెట్లో పెట్టుకున్న ఎమ్మెల్యే తిప్పేస్వామి ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళితే ఒక్క ఓటు పడదని వైటి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయనను టీటీడీ బోర్డు పదవి నుంచి సైతం తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్త చేసిన ఆరోపణలతో కూడిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఎమ్మెల్యే మాకొద్దు, ఈయనకు టీటీడీ బోర్డు మెంబర్ పదవి తొలగించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డిని అభ్యర్థించారు.