జగ్గయ్యపేటలో డయేరియా విజృంభణ- ప్రైవేటు ఆసుపత్రిలో ఒకరు మృతి - DIARRHEA - DIARRHEA
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 21, 2024, 3:31 PM IST
Diarrhea Cases Was Increase in Jaggayyapeta Region: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలోని పలు గ్రామాల్లో డయేరియా కేసులు విజృంభిస్తున్నాయి. గురువారం రాత్రి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. గురువారం రాత్రి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి డీఎంహెచ్ఓతో మాట్లాడారు. దీంతో అర్థరాత్రి ఆమె ఆసుపత్రులు సందర్శించి అవసరమైన చర్యలకు ఆదేశించారు. జగ్గయ్యపేటతో పాటు షేర్ మహ్మద్ పేట, దేచూపాలెం, వత్సవాయి, మక్కపేట, గండ్రాయి గ్రామాల నుంచి వచ్చిన రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య చికిత్స పొందుతున్న వారితో వాళ్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జర్వం, వాంతులు, విరోచనాలతో ఇబ్బందిపడుతున్నట్లు బాధితులు ఆయనతో చెబుతున్నారు. మరోవైపు వర్షాకాలం మొదలుకాబోతున్న నేపథ్యంలో డయేరియాతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడుతున్న సమయంలో నీటి నిల్వ కారణంగా రోగాలు ప్రభలుతుంటాయి. గత నెలలో కూడా విజయవాడలో డయేరియాతో ఎనిమిది మంది మృతిచెందారు. మొగల్రాజపురంలో నివాసం ఉంటున్న వందల మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు.