టీడీపీ ఏజెంట్‌పై అంజాద్ భాష బెదిరింపులు-ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన - Deputy Chief Minister Anjad Bhasha - DEPUTY CHIEF MINISTER ANJAD BHASHA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 1, 2024, 10:40 PM IST
Deputy Chief Minister Anjad Bhasha: కడప నగరంలోని ఓ పోలింగ్ బూతులో తెలుగుదేశం ఏజెంట్‌ను ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలింగ్ సందర్భంగా బూతులోకి వెళ్లిన వైఎస్సార్సీపీ అభ్యర్థి అంజాద్ భాష అక్కడున్న టీడీపీ ఏజెంట్ పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎందుకు బయట తిరుగుతున్నావని లోపల వెళ్లి కూర్చోవాలని హుకుమ జారీ చేశారు. దీనిపైన అభ్యంతరం తెలియజేసిన టిడిపి ఏజెంట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో గంటలో పోలింగ్ ముగుస్తుందని, అప్పటి వరకే నీ ఆటలు తెలుస్తాయని తర్వాత ఐదేళ్లు అధికారంలో పశ్చాత్తాప పడాల్సి వస్తుందంటూ కేకలు వేసుకుంటూ అంజాద్ భాష బయటికి వెళ్లిపోయారు. ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో హల్చల్ చేస్తుంది. అదేవిధంగా ఓ పోలింగ్ బూత్ లో టీడీపీ తరఫున ఏజెంట్గా కూర్చున్నారని కారణంతో ఇవాళ తెల్లవారుజామున శంకరాపురంలో ప్రసాద్ రెడ్డి అనే ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలే ఓటమి భయంతో ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని టిడిపి పోలీట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.