జగన్ నామినేషన్ వేస్తున్నాడని నేను నామినేషన్ వేయకూడదా ? : దస్తగిరి - Dastagiri allegations on CM Jagan - DASTAGIRI ALLEGATIONS ON CM JAGAN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-04-2024/640-480-21285719-thumbnail-16x9-dastagiri.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 22, 2024, 3:50 PM IST
Dastagiri made sensational allegations: వివేక హత్య కేసులో సునీతతో తాను చీకటి ఒప్పందం చేసుకున్నానని అవినాష్ రెడ్డి నిరూపిస్తే జైలుకు వెళ్లడానికి సిద్ధమేనని వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సవాల్ విసిరారు. అవినాష్ రెడ్డి నిరూపించ లేకపోతే జైలుకు వెళ్లడానికి ఆయన సిద్ధమా? అని ప్రశ్నించారు.
వివేకా కేసులో హంతకుడు బయట తిరుగుతున్నాడని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటాన్ని దస్తగిరి తప్పుబట్టారు. హత్య చేయించింది ఎవరో జగన్, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డికి తెలియదా? అని ప్రశ్నించారు. తాను పులివెందులలో జై భీమ్ భారత్ పార్టీ తరఫున నామినేషన్ వేయడానికి యత్నిస్తుంటే పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 25న తాను నామినేషన్ వేయాలని అనుకుంటే జగన్ నామినేషన్ వేస్తుండడం వల్ల నేను నామినేషన్ వేయడం కుదరదని అధికారులు చెప్పడంపై దస్తగిరి మండిపడ్డారు. జగన్ నామినేషన్ వేసేటప్పుడు ఇతరులు ఎవరూ నామినేషన్ వేయకూడదని ఎన్నికల నిబంధన ఏమైనా ఉందా? అని దస్తగిరి ప్రశ్నించారు.