అంబేడ్కర్‌ ఆశయ సాధనకు చంద్రబాబు పాలన అవసరం: మహాసేన రాజేష్‌ - mahasena rajesh

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 12:29 PM IST

Dalituda Ra Kadali Ra MahaSabha Was Held at Nidadavolu: అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకం పేరు మార్పుపై వైసీపీ నేత జూపూడి ప్రభాకరరావు చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం అధికార ప్రతినిధి మహాసేన రాజేష్‌ ఖండించారు. పేరు మార్చినప్పటికీ డబ్బులు ఇస్తున్నారంటూ జూపూడి వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. డబ్బులు ఇచ్చినంత మాత్రాన అంబేడ్కర్‌ పేరు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన దళితుడా 'రా కదలిరా' సభకు నియోజకవర్గ పరిధి నుంచి అధిక సంఖ్యలో దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ముందుగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా సభలో రాజేష్‌ మాట్లాడుతూ దళితులపై దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులతో కఠిన చర్యలు తీసుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. దళితుల రాజకీయ ఎదుగుదలకు టీడీపీ ఎంతో సహకరిస్తే, వైసీపీ పాలనలో దాడులు, హత్యలు పెరిగిపోయాయని మహాసేన రాజేష్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్‌ ఆశయ సాధనకు చంద్రబాబు పాలన అవసరమన్నారు. రాబోయే ఎన్నికల్లో దళితులంతా టీడీపీ-జనసేనకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.