వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయి: దళిత నేతలు - Dalit Bahujan Front
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 3:36 PM IST
Dalit Bahujan Front Round Table Meeting: రాబోయే ఎన్నికల్లో దళిత బహుజనుల రాజకీయ కార్యాచరణపై విజయవాడలో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ నాయకులు మేళం భాగ్యారావు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో మతతత్వ, కులతత్వ పార్టీలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ సంక్షేమ పథకాలను రద్దు చేశారన్నారు. సబ్ ప్లాన్ నిధులను ఇతర పథకాలకు మళ్లించి దళితులకు అమలు చేస్తున్న 27 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దుర్మార్గమైన పరిపాలనతో వెనకబడిన వర్గాలకు సంక్షేమ పథకాల పేరుతో మరమరాలు పంచి పెడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా దళితులకు అమలు చేస్తున్న పథకాలను రద్దు చేశారన్నారు. వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నడూ లేనన్ని దాడులు జగన్ పాలనలో జరిగాయన్నారు. రాబోయే ఎన్నికల్లో మతతత్వ, కులతత్వ పార్టీలకు దళితులు బుద్ధి చెబుతారన్నారు.